అనేక సంవత్సరాల పాటు అసలు దాని ఊసే మరచిపోయి, ఇప్పుడు అకస్మాత్తుగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం వెనుక తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీయాలనే కుట్ర ఉన్నది.
తెలుగు భాష, సంస్కృతి ముసుగులో తెలంగాణ భాషను, సంస్కృతిని అణగదొక్కడం ఉమ్మడి రాష్ట్రంలో నిత్యకృత్యమైపోయింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పుణ్యమా అని ఇప్పుడిప్పుడే తెలంగాణ భాష, సంస్కృతుల పునరుజ్జీవనం మొదలయ్యింది.
అసలు ఈ తెలుగు మహాసభల నిర్వహణ మొత్తం సీమాంధ్రుల కనుసన్నల్లో నడుస్తోంది. ప్రభుత్వం నుండి వచ్చిన కోట్ల నిధులకు తోడు విరాళాలు కూడా సేకరించి దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు ఈ ఉత్సవాలపై. ఈ సభల నిర్వహణలో అత్యంత కీలకమైన ఆర్ధిక సంఘంలో తెలంగాణ ప్రాంతానికి కనీస ప్రాతినిధ్యం లేకుండా చేశారు. ఆ లిస్టు చూడండి ఒకసారి:
పద్దెనిమిది మంది ఉన్న ఈ ఆర్ధిక సంఘంలో 17 మంది సీమాంధ్ర పారిశ్రామికవేత్తలను, రాజకీయ నాయకులను, అధికారులను నింపి తెలుగుదేశం ఎంపీ నామా నాగేశ్వర రావు అనే ఒక సెట్లర్ ను మాత్రం తెలంగాణ నుండి ఎన్నిక చేశారు. (నామా కూడా సీమాంధ్రుల తొత్తు అని చాలాసార్లు నిరూపణ అయ్యింది)
సభల నిర్వహణలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే ఆర్ధిక సంఘం రూపకల్పనే ఇంత దారుణమైన వివక్ష చూపించిన సీమాంధ్ర పాలకులు ఏ ముఖంతో సమైక్యతను ప్రబోధిస్తారు?