mt_logo

సీమాంధ్ర ఎంపీలను జీవితకాలం బహిష్కరించాలి

పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి మారణాయుధాలు, పెప్పర్ స్ప్రే ఉపయోగించిన సీమాంధ్ర ఎంపీలు జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించాలని తెలంగాణ పది జిల్లాల్లో రెండవరోజూ నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ, కాంగ్రెస్, బీజేపీ, జాగృతి, విద్యార్థి సంఘాలు, న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో సీమాంధ్ర నేతలకు ఉరితీసి దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటే సీమాంధ్రులను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ పై లగడపాటి పెప్పర్ స్ప్రే దాడి చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నిరసన దీక్ష చేశారు. వరంగల్, కాజీపేట్ లో లగడపాటి, వేణుగోపాల్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కరీంనగర్ టవర్ సర్కిల్ లో లగడపాటి దిష్టిబొమ్మకు గౌను, గాజులు తొడిగి చీరలు పంచి నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్గొండలో టీఆర్ఎస్, న్యాయవాదుల సమక్షంలో లగడపాటి వేషధారణలో ఉన్న వ్యక్తిని గొలుసులతో కట్టి ముఖానికి లగడపాటి ఫ్లెక్సీ పెట్టి క్షమించరాని తప్పు చేశావంటూ కోర్టు నుండి గడియారం సెంటర్ వరకు లాక్కునివచ్చారు. అక్కడ చెట్టుకు లగడపాటి దిష్టిబొమ్మను ఉరి వేశారు. ఆదిలాబాద్ లో లగడపాటి ఫ్లెక్సీని దహనం చేశారు. నిజామాబాద్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సీమాంధ్ర ఎంపీల దిష్టిబొమ్మను దహనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *