By: సవాల్ రెడ్డి
—
కేసీఆర్ అట, కాంగ్రెస్ ను సీఎం పదవి అడిగాడట! ఏ సీఎం అట? అదీ ఇదీ కాదు. ఏకంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం అట!
పాపం కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలని ఉన్నా కేసీఆర్ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక ఎంతో ఇబ్బందిపడిపోయి, ఇవ్వలేకపోయిందట! దుష్ట కేసీఆర్ ప్రతిపాదనల కారణంగా ఇచ్చే తెలంగాణ కాస్తా ఆగిపోయిందట. కొద్దిపాటి తేడాలతో ఇదీ ఆంధ్ర మీడియా ప్రచారం.
ఈ కథ ఎవడో తలకు మాసిన వాడు వండితే. ఏనాడూ నిజాలు చచ్చినా రాయని ఆంధ్రజ్యోతి, తర్వాత పత్రికా కార్యాలయం నుంచి వంద గజాల అవతల ఎంత వెతికినా దొరకని ఆంధ్రప్రభ అనే ఓ పేపర్, చిలవలు పలువలుగా వేసేసాయి. దాన్ని కొన్ని వెబ్ సైట్లు మోసేస్తుంటే, బుర్రతప్ప అందులో బుద్ది అనే పదార్థం లేని అజ్ఞానులు తెగ ఎంజాయ్ చేస్తూ…
అయిపోయింది! ఈ దెబ్బకు కేసీఆర్ ఇమేజ్ అవుట్ అనుకుని తెగ ఆనందపడిపోతున్నారు.
బుర్ర అనే దాంట్లో మెదడు అనే రసాయినిక పదార్థం పనిచేసే స్థితిలో ఉన్న వాడెవడికైనా తెలుసు. కేసీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం అడగడం అసాధ్యమని. 12 ఏళ్లనుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డా కష్టాలుపడ్డా తిట్లుపడ్డా, తేలికైన అనేక మార్గాలు అందుబాటులో ఉన్నా అవన్నీ వదులుకుని, తెలంగాణ అంటున్న వ్యక్తి…ఏ రోజైనా తన వాదాన్ని వదులుకుంటే పదవులు ఒల్లో వచ్చి వాలే అవకాశాలు ఎన్నో కళ్ల ముందే ఉన్నా అవన్నీ కాదనుకుని ఇవాళ పదవుల కోసం బేరం పెట్టాడని. నమ్మబుల్ గా ఉందా?
తెలంగాణ వాళ్లు వదిలేస్తే. సీఎంగా కేసీఆర్ ను ఆంధ్రావాళ్లు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారని కేసీఆర్ అనుకుంటాడా?
ఇవన్నీ వదిలేసినా…
జగన్ ఎపిసోడ్ చూసి కాంగ్రెస్ ను ఎవరైనా సీఎం పదవి అడుగుతాడా?
సీఎం పదవి ఇవ్వడానికి నిరాకరించడం వల్లనే కదా జగన్ బయటకు వెళ్లింది.మరి అలాంటి కాంగ్రెస్ తనకు సీఎం పదవి ఇస్తుందని, ఇంత రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఊహిస్తారా? అలా కనీసం ఆలోచిస్తారా? అలాంటి ప్రతిపాదన తెస్తారా?
ఈ సీఎం పదవి ఇవ్వకనే కదా కాంగ్రెస్ రాష్ట్రంలో దుర్గతి పాలైంది. అయినా చలించకుండా ఉన్న పార్టీ కేసీఆర్ అడిగితే ఇస్తదా? ఇది నమ్మబుల్ గా ఉందా?
ఆంధ్రజ్యోతి కొద్దిపాటి తేడాలతో వేసిన ఈ కథలో ఇంకా ఏముందంటే, కొడుక్కు ఎంఎల్ఏ సీటూ, కూతురుకు రాజ్యసభ సీటు అడిగాడనిమసాలా యాడ్ చేశారు. అసలు వాళ్లకు సీటు ప్రత్యేకంగా అడిగేదేముంది? ఆయన ఆల్రెడీ ఎంఎల్ ఏనే…..హరీష్ అంతే.
అయినా ఈ అడగడం విలీనం తర్వాత అడగడం కుదరరదా? అడిగితే కాంగ్రెస్ ఇవ్వదా? ముష్టి చిరంజీవి విలీనం అయితే కేంద్రమంత్రి పదవీ, రాష్ట్రంలో రెండు పదవులు, కొత్తగా ఏ అవకాశాలు వస్తున్నా వాటా ఇవ్వడం లేదా? కేసీఆర్ అడిగితే ఇవ్వరా?
చిరంజీవి అడిగితే న్యాయం.కేసీఆర్ విషయంలో మాత్రం అదేదో అఘాయిత్యం అన్నట్లు బిల్డప్పులు, కలరింగులు.
తెలంగాణ విషయం చర్చ కోసం పిలిచింది కాంగ్రెసే. చర్చలు జరిపింది కాంగ్రెస్సే.విలీనం ప్రతిపాదన తెచ్చింది వాళ్లే. తర్వాత రాజ్యాంగపరమైన అంశాల పరిశీలనకు సమయం కావాలంటూ తిరిగి పిలుస్తామని చెప్పింది వాళ్లే. ఢిల్లీలో జరిగింది పదవుల చర్చ కాదు. రాయల తెలంగాణ, మూడురాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ భవిష్యత్తు.
ఈ విషయంలోనే కేసీఆర్ అభిప్రాయాలు సోనియాకు తెలపడం కొత్త ప్రతిపాదనలపై మళ్లీ చర్చలు… ఈ చర్చల అనంతరమే రాయల తెలంగాణ, హైదరాబాద్ కేంద్రపాలితం ప్రతిపాదనలు పూర్తిగా డ్రాప్ అయ్యింది. ఆంధ్ర రాజధాని హైదరాబాద్లో ఎన్నేళ్లుండాలి అనే విషయమై కేసీఆర్ ప్రతిపాదనలు తీసుకుని చర్చిద్దాం అని వీడ్కోలు చెప్పారు. అందుకే ఆ తర్వాత నెలకు పైగా కేసీఆర్ చప్పుడుచేయలేదు.
అప్పటికీ ఉలుకుపలుకు లేనందుననే తిరిగి విమర్శలు ప్రారంభించారు.
జరిగింది ఇది కాగా… వెంట్రుకకు కొన మొదలు కూడా తెలియని సన్నాసులు నోటికొచ్చిన కథలు రాస్తున్నారు.