—
కాంగ్రెస్ కేంద్ర నాయకులను ఏదో ఒక మిష మీద తరచూ సీమాంధ్రకు ఆహ్వానించడం, వారికి “సకల మర్యాదలు” చేయడం సీమాంధ్ర నాయకులకు అలవాటు. అందులో భాగంగానే నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న బ్రిడ్జి నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి సుషీల్ కుమార్ షిండే విచ్చేశారు. హోం శాఖకు ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఏం సంబంధం ఉందో షిండేకే తెలవాలె. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన కావూరి సాంబశివరావు నేతృత్వంలో ఈ మీటింగ్ జరిగింది. ఇదీ సీమాంధ్ర లాబీయింగ్ స్టైల్!