సమైక్య ఉద్యమం ముసుగులో ఏపీ భవన్ కు చేరుకున్న సీమాంధ్ర నాయకులకు అచ్చం అల్లుళ్ళకు మల్లే రాచ మర్యాదలు రెండోరోజు కూడా జరిగాయి. ఏపీ భవన్ అధికారులు కడుపులో సల్ల కదలకుండా సీమాంద్రులను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. భవన్ లోని దాదాపు 25 రూములను వారికే ఇచ్చిండ్రు. ప్రత్యేక భోజనసదుపాయాలు కల్పించి స్వయంగా దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉద్యోగులకు రూం వసతుల దగ్గరనుండి అన్ని సౌకర్యాలను ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఉద్యోగుల ఢిల్లీ విహారానికి, షాపింగ్ కొరకు ఏపీ భవన్ కు చెందిన బుగ్గ కార్లను ఉపయోగించడం విశేషం.
తెలంగాణ ఉద్యమాలు జరిపిన ప్రతిసారీ ఇక్కడ తిండికి, వసతికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఏపీ భవన్ అధికారులు సహకరించడం మాట అటుంచి రూములు వున్నా లేవనే సమాధానం వచ్చేది. అందుకు భిన్నంగా ఇప్పుడేమో అధికారులు స్వయంగా దగ్గరుండి రాచ మర్యాదలు చేస్తున్నరని ఢిల్లీ తెలంగాణ జేఏసీ కి చెందిన ఒక నాయకుడు వాపోయారు. శుక్రవారం నాడు సగం మంది ఉద్యోగులు ధర్నా లో పాల్గొనగా మిగతావారు షాపింగ్ కి పోయిండ్రు.