ఒక పక్క శాసనసభలో సీమాంధ్ర నేతలు ఇంత గందరగోళం సృష్టిస్తున్నా, రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడే వివిధ అంశాల నిర్ణయాలు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇంకొద్ది రోజుల్లో నిజం కానున్నదనే విషయం ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతోంది.
ప్రభుత్వ ఆధీనంలోని 20 ముఖ్య శాఖలు ఉద్యోగుల పంపకాలు, ఇతర ఆస్తుల పంపకాలపై తమ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి ఈ వారమే ఇవ్వనున్నాయి. విభజన అనంతరం ముసాయిదా బిల్లులోని అంశాల ప్రకారం ప్రభుత్వ శాఖలు నిర్వర్తించాల్సిన పనులను తమ, తమ నివేదికల్లో వివరించాలని సీఎస్ పీకే మహంతి ఆయా వర్గాలకు సూచించారు.