mt_logo

సంవత్సరంలోపు ఛత్తీస్‌గఢ్ నుండి కరెంట్ – కేసీఆర్

శుక్రవారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది కల్లా రాష్ట్రానికి సరిపడా విద్యుత్ సాధిస్తామని, ఛత్తీస్ గడ్ నుండి అదనంగా 1000 మెగావాట్ల విద్యుత్ 2015 లోనే తీసుకొస్తామని, మూడేండ్లలో మొత్తం 20 వేల మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తెచ్చి చూపుతామని స్పష్టం చేశారు. కొత్తగూడెం ప్లాంట్ నుండి 500 మెగావాట్లు, భూపాలపల్లి నుండి 600 మెగావాట్లు, ఎన్టీపీసీ సింహాద్రి నుండి 300 మెగావాట్ల విద్యుత్ జూన్, జూలై నాటికల్లా అందుబాటులోకి వస్తుందని సీఎం చెప్పారు.

మూడేళ్ళలో మొత్తం 20 వేల మెగావాట్ల విద్యుత్ ఎలా సాధ్యమని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డికి సమాధానంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, హంగుల్ పలాసా నుండి 4500 మెగావాట్లు, వార్ధా నుండి డిచ్ పల్లి ద్వారా 4500 మెగావాట్లు వస్తాయని, బీహెచ్ఈఎల్ నుండి 1280 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని, థర్మల్ ద్వారా 6 వేల మెగావాట్లు, హైడల్ ద్వారా 2400 మెగావాట్లకు పైగా విద్యుత్ అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న 8 వేల మెగావాట్లకు మొత్తం కలిపి 2015 నాటికి 20 వేల మెగావాట్లను సాధించగలుగుతామని కేసీఆర్ స్పష్టం చేయడంతో జానారెడ్డి స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న దానికి కలుపుకుంటే ఇది సాధ్యమేనని, తనకు సీఎం ఇచ్చిన సమాధానంతో స్పష్టత వచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *