“పంచ పాండవులు – మంచపు కోళ్ళు” సామెత గుర్తొస్తోంది నిన్నటి తెలంగాణ-వ్యతిరేక మీటింగుపై సీమాంధ్ర మీడియా కతలు చూస్తుంటే. వచ్చింది 25-30 మంది ఎమ్మెల్యేలు అయితే ఒకడేమో 68 మంది హాజరు అని పతాక శీర్షికలో అర్థం అయ్యీ కానట్టుగా రాస్తాడు. ఒకడేమో మీటింగుకు రానోళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో కూడా మీటింగు వార్తలోనే భాగంగా రాసేస్తాడు. ఇంకొకడు ఒక ఇరవై పేర్లను బరికేసి “తదితరులు” అని ఆయాసపడిపోతాడు.
సీమాంధ్ర నుండి ఇరవై మంది లోక్ సభ ఎంపీలుంటే, ఈ సభకు ముష్టి ఇద్దరు వచ్చారు. అయినా సరే ఒక్క సీమాంధ్ర మీడియాకు కూడా రానివాళ్లు కనిపించరు.
ఇక హిందూ పత్రికకయితే ఏకంగా 70 మంది ఎమ్మెల్యేలు కనపడ్డారండి నిన్నటి మీటింగులో.
వచ్చినోళ్లలో ఒకే ఒక్క నాయకుడు రాజీనామాల ప్రస్తావన తెచ్చాడు. అయితేనేం “రాజీనామాలకు సిద్ధం” అని వారి తరఫున మన సీమాంధ్ర మీడియానే శిగాలు ఊగిపోయింది.
ఒక అబద్ధపు సమైక్య భావాన్ని ప్రచారం చేయడానికి ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడాల్సి వస్తుండో చూడంది ఈ సిగ్గులేని పచ్చ మీడియాకు!