త్వరతగతిన పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటు బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేచ్చేందుకు ఈ నెల 29న హైదరాబాద్ లో ‘సకలజన భేరి’ సభ నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.
ఖమ్మం ఆర్ అండ్ బి అతిధి గృహంలో జిల్లా జేఏసీ నేతలతో కలిసి ‘సకలజనభేరి’ పోస్టర్ ను విడుదల చేశారాయన. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర శక్తులు నానారకాలుగా కుట్రలు పన్నుతున్నాయని, అయినా రాష్ట్రా ఏర్పాటు ఖాయమని ఆయన అన్నారు.
అసలు చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టత ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేసారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి వల్ల ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొందని, దానికి ముమ్మాటికి చంద్రబాబే కారణమని ఆయన ధ్వజమెత్తారు. టీటీడీపీ నేతలు కూడా గతంలో ఇచ్చిన లేఖకు బాబు కట్టుబడి వుండేలా ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు.
హైదరాబాద్ ను యూటీగా ప్రకటిస్తే తెలంగాణలోని ఏ ఒక్కరూ ఒప్పుకోరని, ఎవరు అవునన్నా కాదన్నా హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనని కోదడరాం స్పష్టం చేశారు.