mt_logo

93 కోట్ల చేప పిల్లలు వదులుతాం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలో ఉన్న వివిధ రిజర్వాయర్లలో, చెరువుల్లో 93 కోట్ల చేప పిల్లల్ని వదిలే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని కోటపల్లి ప్రాజెక్టులో ఐదవ విడత చేపపిల్లల్ని వదిలే కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. 89 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 93కోట్ల చేప పిల్లల్ని, 10కోట్ల రొయ్య పిల్లల్ని నీటి వనరుల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో 447 మందికి కోటి 40 లక్షల రుణాలు ఇచ్చామని, 105 మృత్స పారిశ్రామిక సహకార సంఘాల్లో 4,429 మంది సభ్యులు ఉండగా వీరందరికి 100 శాతం రాయితీపై చేప పిల్లల్ని, రొయ్య పిల్లల్ని అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గత సంవత్సరం జిల్లా పరిధిలో 79.33 లక్షల చేప పిల్లలను ఒక చేపకు 47 పైసల చొప్పున 34 లక్షల 22 వేలు వెచ్చించి చెరువుల్లో వదలడం జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, కాలే యాదయ్య, కలెక్టర్ నిఖిల, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *