రాష్ట్రంలో రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు గానూ పరిపాలన అనుమతులు మజూరు అయ్యాయి. 13 రోడ్లు, 33 వంతెనలకు 200.48 కోట్ల నిధులు మంజూరు కాగా ఇందులో నాబార్డ్ రుణం రూ. 160.38 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 40.10 కోట్లు.
మరోవైపు పరిశ్రమల శాఖపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలవారీగా ఎస్ఈజెడ్ లు, పారిశ్రామికవాడల అంశాలపై చర్చలు జరిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఇతర కంపెనీల పెట్టుబడుల అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు.