2014-15 సంవత్సరానికి రహదారుల అభివృద్ధికోసం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈటెల ప్రకటించారు. కొత్తగా 1000 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు, 2019 నాటికి ఎస్సీల అభివృద్ధికి రూ. 50 వేలకోట్లు, ఐటీఐఆర్‌కు రూ. 90 కోట్లు, ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ. 975 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు.
తెలంగాణలో కరెంట్ కష్టాలను అధిగమించేదిశగా రానున్న ఐదేళ్ళలో 25 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు, రామగుండం ఎన్‌టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఈటెల పేర్కొన్నారు. జెన్‌కో ద్వారా మరో 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు, సోలార్ విద్యుత్ కోసం ఇప్పటికే టెండర్లను పిలిచినట్లు మంత్రి చెప్పారు. ఇందుకోసం విద్యుత్ రంగానికి రూ. 3,241 కోట్లు, సోలార్ పవర్ కోసం రూ. 40 కోట్లు, తెలంగాణ రాష్ట్ర జెన్‌కోలో పెట్టుబడికోసం రూ. 1000 కోట్లు కేటాయించినట్లు ఈటెల తెలిపారు. రాష్ట్ర ఆర్ధికమంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం శాసనసభను స్పీకర్ ఎల్లుండికి వాయిదా వేశారు.