రాష్ట్రంలోని రోడ్ల అధ్యయనానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం రాజయ్య అధ్యక్షతన పనిచేయనున్న ఈ ఉపసంఘంలో సభ్యులుగా నాయిని, పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, ఈటెల, కేటీఆర్, జోగురామన్న, జగదీష్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి రూ. 10 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. రోడ్ల నిర్మాణానికి ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించనున్నారు.
15 రోజుల్లో టెండర్లను ప్రభుత్వం పిలవనుందని, జిల్లాకు రూ. వెయ్యి కోట్లను ఖర్చు చేయనుందని తెలిసింది. సంవత్సరం లోపు రోడ్లన్నీ అద్భుతంగా తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుండి సిటీ లోపలికి మెదక్, కరీంనగర్, నల్గొండ, వరంగల్ రహదారులపై పీవీ ఎక్స్ ప్రెస్ హైవేల తరహాలో నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.