ఏపీఎన్‌జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబుపై పలువురు సీమాంధ్ర ఉద్యోగులు తిరుగుబాటు ప్రకటించారు. అతడికి వ్యతిరేకంగా ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, జనవరిలో జరగనున్న ఎన్నికల్లో అశోక్‌బాబు ప్యానల్ ను ఓడించాలని నిర్ణయించారు. ఏపీఎన్‌జీఓ మాజీ అధ్యక్షుడు వీ. గోపాల్‌రెడ్డి అధ్యక్షతన పలువురు ఉద్యోగులు గురువారంనాడు ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు. అశోక్‌బాబు సమైక్య ఉద్యమం ముసుగులో రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడని, సొంత ఆలోచనలతో ఉద్యమాన్ని పక్కదారిపట్టిస్తున్నాడని గోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్ని జిల్లాల నాయకులతో మాట్లాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించామని ఆయన అన్నారు.
డిసెంబర్ 20న మరోసారి సమావేశమై ప్రత్యామ్నాయ ప్యానెల్‌ను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ఏపీఎన్‌జీఓ ప్రధాన కార్యదర్శి పి. సుబ్బరాయన్ మాట్లాడుతూ, అశోక్‌బాబు బహిరంగ సభలు నిర్వహిస్తూ సీమాంధ్ర ప్రజలకు, ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నాడని అన్నారు. కడప జిల్లా అధ్యక్షుడు దేవరాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని సీమాంధ్ర ప్రాంతాల ఉద్యోగులు అశోక్‌బాబు ఒంటెద్దు పోకడలను తీవ్రంగా విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.