mt_logo

టీఆర్ఎస్ తోనే పునర్నిర్మాణం – రసమయి బాలకిషన్

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని తెలంగాణ ధూంధాం రాష్ట్ర అధ్యక్షుడు రసమయి బాలకిషన్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన సర్పంచ్ కిన్నెర సారయ్యతో పాటు అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు 300 మంది టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రసమయి బాలకిషన్ మాట్లాడారు. 14 సంవత్సరాలనుండి కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, పునర్నిర్మాణం ఆయనవల్లే సాధ్యమని పేర్కొన్నారు. కేసీఆర్ రూపొందిస్తున్న మేనిఫెస్టోలో దళితులకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. తన పాటల ప్రస్థానం కరీంనగర్ జిల్లా నుండే మొదలైందని, రాజకీయ ప్రస్థానం కూడా అదే జిల్లానుండి మొదలవుతున్నందున తనను ఆశీర్వదిస్తే అండగా ఉంటానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *