mt_logo

రంగారెడ్డి జెడ్పీ టీఆర్ఎస్ సొంతం

21మంది జెడ్పీటీసీల ఓట్లతో రంగారెడ్డి జెడ్పీ పీఠాన్ని టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో టీడీపీతో కలిసి జెడ్పీ చైర్ పర్సన్ పదవితో పాటు రెండు కో ఆప్షన్ పదవులను దక్కించుకుంది. యాలాల్ జెడ్పీటీసీ సభ్యురాలు సునీతా మహేందర్ రెడ్డి వరుసగా రెండోసారి జెడ్పీ చైర్ పర్సన్ గా ఎన్నికకాగా, టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన టీడీపీ జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని కుత్బుల్లాపూర్ జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

టీఆర్ఎస్ పార్టీ సొంతబలం 12కాగా, టీడీపీకి చెందిన 7గురు, కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థి అయిన సునీతా మహేందర్ రెడ్డికి మద్దతు తెలిపారు. దీనితో టీఆర్ఎస్ బలం 21కి చేరి జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. 14జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్నా కాంగ్రెస్ జెడ్పీ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది.

ఇదిలాఉండగా మండల పరిషత్ లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. నల్గొండ జిల్లా ఆత్మకూర్, యాదగిరిగుట్ట ఎంపీపీలు, కరీంనగర్ జిల్లా మహాముత్తారం, మంథని ముత్తారం ఎంపీపీలు, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, నల్లబెల్లి, జనగామ ఎంపీపీలు, నిజామాబాద్ జిల్లా భిక్కనూరు ఎంపీపీ, రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల ఎంపీపీ పీఠాలను టీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *