తెలంగాణ పది జిల్లాల్లో జరగబోయే రంజాన్ పండుగ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నగర మేయర్ మాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ పండుగ ఏర్పాట్లపై చర్చించిన సీఎం కేసీఆర్ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా మీడియాతో మాట్లాడుతూ, రంజాన్ పండుకకు 10జిల్లాల్లో 5కోట్ల రూపాయలు విడుదల చేయాలని, మసీదుల్లో సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
మరోవైపు సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను అమెరికా కాన్సులేట్ జనరల్ కలిశారు. వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపినట్లు సమాచారం.