డిప్యూటీ సీఎం టీ రాజయ్య ఈరోజు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తప్పకుండా రైతులను ఆదుకుంటామని, రైతులకు సరిపడా విద్యుత్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 5 గంటలకు తక్కువ కాకుండా విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఎవరితోనూ చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు మొసలి కన్నీరు వల్ల తమకు ఒరిగేది ఏమీ లేదని రాజయ్య పేర్కొన్నారు.
ఇదిలాఉండగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తుతో సమావేశం కానున్నారు. ఏపీకి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని, రెండు రాష్ట్రాలకు వేర్వేరు కోర్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారని తెలిసింది.