డెంగ్యూ జ్వరాలపై ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రాజయ్య విలేకరులతో మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో 53 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ప్రజలు డెంగ్యూ బారిన పడుతున్నారని, రేపు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.