వీర సమైక్యవాదిగా ఫోజు ఇచ్చే కావూరి సాంబశివరావుకే షాక్ ఇచ్చిండ్రు సీమాంధ్ర ఆందోళనకారులు.
నిన్న కావూరి తన స్వస్థలానికి వస్తున్నాడని తెలుసుకున్న కొంతమంది ఆందోళనకారులు ఆయన ఇంటిముంది ఆందోళనకు దిగారు. తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో కావూరి ఇంటి ముందు కొనసాగుతున్న ధర్నా ఇరువురి మద్ధతుదారుల మధ్య ఘర్షణకు దారితీసింది.
ఇంతలోనే గేటు తీసుకుని కావూరి ఇంట్లోకి జొరబడ్డ కొందరు ఆందోళనకారులు ఆయన ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
కావూరి తన ఇంటికి వచ్చినప్పుడు మరోసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎమ్మెల్యే ప్రభాకర్ మరోసారి కావూరి ఇంట్లొకి జొరబడడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్దుకుని అరెస్ట్ చేశారు.
తన వ్యక్తిగత స్వార్ధం కొరకు సీమాంధ్ర ప్రజలను తెలంగాణకు వ్యతిరేకంగా రెచ్చగొట్టిన కావూరికి ఇప్పుడు మింగలేని కక్కలేని పరిస్థితి వచ్చింది. సీమాంధ్రలో ఆయన ఎక్కడికిపోయినా ఆందోళనకారులు రాజీనామా చేయమని వెంటపడుతున్నారు.