ఎన్నారై టి.ఆర్.ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త స్వర్గీయ ప్రో. జయశంకర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి యు.కే నలుమూలల నుండి తెలంగాణ వాదులు, టీ.ఆర్.ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెక్రెటరీ నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా జయశంకర్ గారి చిత్ర పటాన్ని పూల తో నివాళులర్పించి, తెలంగాణ అమరవీరులను, జయశంకర్ గారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
తరువాత సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, తెలంగాణ బావజాల వ్యాప్తి లో జయశంకర్ గారి పాత్రాగొప్పదని, వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పని చేసారని, అటువంటిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన సంతోష సందర్భం లో మనవద్ద లేకపోవడం చాల బాధాకరం అని పేర్కొన్నారు.
అనుకున్న ఆశయ సాధనకై వారు చేసిన కృషి ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు అన్ని ఆచార్య గారి మానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనం తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ అధ్యక్షుడు – తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ప్రధాన కార్యదర్శి దూసరి అశోక్ గౌడ్, కార్యదర్శులు నవీన్ రెడ్డి – వెంకట్ రెడ్డి, లండన్ ఇన్‌ఛార్జ్ రత్నాకర్ కడుదల, ముఖ్య నాయకులు హరి నవపేట్, శ్రీధర్ రావు, శ్రీకాంత్ జెల్ల, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రవీణ్ కుమార్, రమేశ్ ఈశంపల్లి, సత్యం కంది, జె.టీ.ఆర్.డి.సి యూకే ఛైర్మన్ సృజన్ రెడ్డి చాడా, ఐటీ జ్యాక్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, TDF నాయకులు శ్రీనివాస్ రెడ్డి పింగళి మరియు శ్రీకాంత్, ఇతర తెలంగాణ వాదులు చిత్తరంజన్ రెడ్డి, శ్రీధర్ నైనకంటి, రోహిత్ రేపక తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.