తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త స్వర్గీయ ప్రో. జయశంకర్ గారి జయంతి వేడుకులని లండన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యు.కే నలుమూలల నుండి తెలంగాణ వాదులు, భారీగా పాల్గొన్నారు.
ముందుగా జయశంకర్ గారి చిత్ర పటాన్నిపూల తో నివాళులర్పించి, జయశంకర్ గారిని స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండునిమిషాలు మౌనం పాటించారు.
తరువాత సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ,తెలంగాణ బావజాల వ్యాప్తిలో జయశంకర్ గారి పాత్ర గొప్పదని, తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారి కొత్తపల్లి జయశంకర్ సారు. నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ సాధన పోరాటం వరకు ఆయన పాత్ర చిరస్మరణీయం వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పనిచేసారని, అటువంటిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన సంతోష సందర్భంలో మన వద్ద లేకపోవడం చాల బాధాకరం అనిపేర్కొన్నారు.
అనుకున్నఆశయ సాధనకై వారు చేసిన కృషి ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని, వారి జీవిత వృతాన్తాన్ని పాట్యపుస్తకాల్లలో పెట్టాలని, రాబోయే తరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని కొనియాడారు ప్రవాస తెలంగాణ సంఘాలు అన్నీ ఆచార్య గారి మానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనం తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.
ప్రో.జయశంకర్ గారి జయంతి వేడుకుల సందర్భంగా తెలంగాణ ఎన్నారై ఫోరంలోఉచిత నోట్ బుక్స్ పంపిని మల్కాజిగిరి నేరెడిమేట్ ప్రభుత్వ పాఠశాలలో జరిగినది మరియు సంధ్య నాగుల అధ్యక్షతన రాబోయే రోజుల్లో సంస్థ చేయబోయే వివిధ సేవ కారిక్రమాల గురుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
TeNF ఫౌండర్ గంప వేణు గోపాల్, అధ్యక్షులు సీక్క చంద్రశేఖర్, TeNF, అడ్వైజర్ బోర్డు సభ్యులు గోలి తిరుపతి, ఈవెంట్స్ ఇన్‌చార్జ్ నగేష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సుధాకర్ రంగుల, స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ నరేష్ మరియు ఎగ్జిక్యూటివ్ టీం సురేష్ బుడగం, రంగు వెంకట్, విక్రమ్ రెడ్డి, రాజ్ నాగుల మరియు ఇతర సభ్యులు వాణి అనస్సూరీ, జ్యోతి కాసర్ల, జయశ్రీ గంప, శౌరి మచ్చ, ప్రీతి నోముల పాల్గొన్నవారి లో ఉన్నారు.