mt_logo

నిజాం షుగర్స్ పై సదస్సు..

నిజాం షుగర్స్ పై రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈరోజు సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జేఏసీ చైర్మన్ కోదండరాం, వామపక్ష నేతలు పలువురు పాల్గొన్నారు. నిజాం షుగర్స్ ను ప్రభుత్వ పరం చేయాల్సిందేనని, చెరుకు రైతులకు రుణమాఫీ వర్తింపచేయాలని పరిరక్షణ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ బోధన్ నిజాం షుగర్స్ ను ప్రభుత్వమే నడపాలని, చెరుకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. నిజాం షుగర్స్ జాతీయీకరణ కోసం జేఏసీ కృషి చేస్తుందని కోదండరాం స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *