mt_logo

పౌల్ట్రీరంగాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటాం – ఈటెల

ఈరోజు వరల్డ్ ఎగ్ డే అయిన సందర్భంగా నెక్లెస్ రోడ్ లో జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా పీపుల్స్ ప్లాజా నుండి నెక్లెస్ రోడ్ వరకు 2 కే రన్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ తో పాటు మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, పశుసంవర్ధక శాఖ సంచాలకుడు డా. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోఈటెల మాట్లాడుతూ, తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమకు ప్రసిద్ధి పొందిందని, పౌల్ట్రీ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.

పౌల్ట్రీ రంగాన్ని 2014 లోపు వ్యవసాయ హోదా కల్పించాలన్నది తమ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని, ప్రస్తుతం నష్టాల్లో ఉన్న పౌల్ట్రీ రంగాన్ని లాభాల్లోకి తీసుకొస్తామని, గత ప్రభుత్వాల వల్లే ఈ పరిశ్రమకు నష్టం వాటిల్లిందని ఈటెల అన్నారు. నిరుపేద గ్రామీణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, పౌల్టీ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో 5 లక్షల మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారన్నారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, గుడ్డులో చాలా పోషకాలున్నాయని, వయసుతో నిమిత్తం లేకుండా ప్రతిఒక్కరూ ఆహారంతో పాటు గుడ్డు తీసుకోవాలని సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *