– జనవరి 28 న లండన్ లో ఘనంగా ఆవిర్భావ సభ
యూకే లో నివసిస్తున్న ప్రవాస తెలంగాణ బిడ్డలందరని ఏకం చేస్తూ త్వరలో ప్రారంభించబోతున్న “తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK- టాక్)” ఆవిర్భావ సభ పోస్టర్ ని ప్రముఖ కవి నందిని సిద్ధ రెడ్డి గారు శుక్రవారం హైదరాబాద్లోని సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. సంస్థ ప్రతినిధి నవీన్ రెడ్డి మాట్లాడుతూ, నాడు ఉద్యమం లో లండన్ వేదికగా మా వంతు బాధ్యత నిర్వహించామని, నేడు అదే స్ఫూర్తితో యూకే నలుమూలల ఉన్న ప్రవాస తెలంగాణ బిడ్డలందరిని కలుపుకొని ఒక వేదికగా ఏర్పడి, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం, రాష్ట్రం లో ఎన్ని సేవా కార్యక్రమాలు చేయడం మరియు బంగారు తెలంగాణ నిర్మాణం లో బాధ్యత నిర్వహించడం వంటి ఎన్నో ఆశయాలతో ఇది ప్రారంభిస్తున్నామని, సహకరించిన మీడియా మిత్రులకి, తెలంగాణ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నెల జనవరి 28 న లండన్ లో ఘనంగా ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నామని, అతిథులుగా రాష్ట్రం నుండి ప్రముఖ కవి నందిని సిద్ధ రెడ్డి గారు, కట్టా శేఖర్ రెడ్డి గారు మరియు స్థానిక యూకే రాజకీయ ఇతర ప్రభుత్వ ప్రతినిధులు, ఇతర ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
ఈ రోజు నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రముఖ కవి నందిని సిద్ధ రెడ్డి గారు, సంస్థ ప్రతినిథులు నవీన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్వేతా, రాజ్ కుమార్ శానబోయిన, ఓయూ జాక్ చైర్మన్ కరాటే రాజు, తెరాస నాయకులు పోచారం సురేందర్ రెడ్డి , మల్లేష్ యాదవ్, ప్రవీణ్ కుమార్, శశిధర్ చేబర్తి, వసుంధర, తెలంగాణ సోషల్ మీడియా నాయకులు కరుణాకర్ రెడ్డి, తెలంగాణ ఆజాద్ ఫోర్స్ నాయకులు తిరుమందాస్ గౌడ్ మరియు తెలంగాణ సామాజిక నాయకులు ఫణికుమార్ పాల్గొన్నారు.