ఫొటో : విజయనగరంలో రాజీవ్ విగ్రహానికి కాపలాకాస్తున్న పోలీసులు
—
పాపం, సీమాంధ్రలో పోలీసులకు రాత్రనకా, పగలనకా విగ్రహాలకు కాపలా కాయడమే సరిపోతోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీడబ్లూసీ నిర్ణయించగానే సీమాంధ్రలో అల్లరిమూకలు చెలరేగిపోయాయి. అటు చిత్తూరు నుండి ఇటు విజయనగరం వరకు జాతీయ నాయకుల విగ్రహాల విధ్వసం అడ్డూఅదుపూలేకుండా కొనసాగింది. రాష్ట్రాన్ని ఏలుతున్న సీమాంధ్ర పెద్దలు, పోలీస్ బాసులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో తొలి మూడు నాలుగు రోజుల్లో సీమాంధ్రలో పదుల సంఖ్యలో నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలు ధ్వంసం అయ్యాయి.
ఈ విషయం ఆనోట ఈనోట కంగ్రెస్ హైకమాండ్ చెవికి చేరడంతో వారి ముఖ్యమంత్రికి, డీజీపీకి చీవాట్లు పెట్టినట్టు సమాచారం. దీంతో అప్పటిదాకా అవలంభించిన మెతకవైఖరి వీడిన పోలీసులు సీమాంధ్రలోని విగ్రహాలకు రక్షణ ఏర్పాట్లు చేశారు.
అది మొదలు గత రెండు వారాలుగా సీమాంద్ర్హలోని అన్ని విగ్రహాలకు పోలీసులు కాపలా కాస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ఉన్న విగ్రహాలకు నలుగురైదుగురు పోలీసులు, సందుల్లో ఉన్న విగ్రహాలకు ఇద్దరు పోలీసులు రాత్రీ పగలూ రక్షణగా నిలుస్తున్నారు.
ఒక్కోటి షిఫ్టు 8 గంటల చొప్పున మూడు షిఫ్టుల్లో ఈ విగ్రహాల రక్షణ కొనసాగుతోంది. ఇతర శాంతిభద్రతల పనులన్నీ వదిలేసిన పోలీసులు కేవలం విగ్రహాల కాపలాకే సమయం మొత్తం కేటాయించాల్సి వస్తోంది.
ఓవైపు వర్షం, మరోవైపు దోమల చలి, ఇంకోవైపు దోమలమోతతో పాపం సీమాంధ్ర పోలీసులకు పడరాని పాట్లు తప్పడం లేదు.