పోలీసులు మరోసారి విచక్షణరహితంగా ప్రవర్తించారు. తెలంగాణ జర్నలిస్టులపై జులుం ప్రదర్శించారు. మహిళా జర్నలిస్టు అన్న కనీస స్పృహ లేకుండా బరితెగించి ప్రవర్తించారు. పిడిగుద్దులు కురిపించారు. కాళ్లతో తన్నారు. గోళ్లతో గిచ్చుతూ.. బూతులు తిట్టారు. సభ్యసమాజంలో ఉన్నామన్న కనీస నైతిక ప్రవర్తన మరిచి.. తమలోని క్రూరత్వాన్ని ప్రదర్శించారు. మేము జర్నలిస్టులమని అరిచి చెప్పినా వినిపించుకోకుండా లాఠీలతో విరుచుకుపడ్డారు. ఇందిరాపార్క్ వద్ద జేఏసీ నిర్వహించిన సమరదీక్ష సందర్భంగా ఖాకీల చేతిలో తెలంగాణ జర్నలిస్టులకు ఇలాంటి అనుభవాలు తప్పలేదు. ‘నమస్తే తెలంగాణ’ మహిళా జర్నలిస్టు కట్టా కవిత సోమవారం సాయంత్రం దీక్షా ప్రాంగణమైన ఇందిరాపార్క్ వద్దకు వచ్చారు. అదే సమయంలో తెలంగాణ ప్రజావూఫంట్ ఆధ్వర్యంలో పలువురు ఆందోళనకు దిగారు. కవిత రోడ్డుపక్కన నిలబడి ఆందోళనను గమనిస్తున్నారు. నిరసనకారులను చెదరగొ ఒక్కసారిగా విరుచుకుపడ్డ పోలీసులు, కవితపైనా ప్రతాపం చూపారు. ఆమెను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన జర్నలిస్టులు వెంటనే నిలదీయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]