పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రజలను రక్షించడంలో పోలీసులది కీలక పాత్ర అని, ప్రాణాలకు తెగించి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నారని ప్రశంసించారు.
ఇదిలాఉండగా హైటెక్స్ లో ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యి బడ్జెట్ అంశాలపై అధికారులతో చర్చలు జరిపారు. మరోవైపు తెలంగాణ ఇంటర్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నం. 21 ప్రకారం ఈ సంవత్సరం ఇంటర్ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పరీక్షలు రాయనున్నారు.