mt_logo

పెన్షన్ల పెంపు ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్

అక్టోబర్ 2 నుండి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లను పెంచుతూ ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. దసరా కానుకగా పెంచిన పెన్షన్లను ప్రభుత్వం అక్టోబర్ రెండు నుండి అర్హులకు ఇవ్వనుంది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వృద్ధులు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 అందజేస్తామని మానిఫెస్టోలో సూచించిన హామీని అన్నట్లుగానే నిలబెట్టుకుంది.

సర్వే గణాంకాల ఆధారంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితుల సమాచారం గుర్తించి పించన్లకు అర్హులుగా ఎంపికచేశారు. గతంలో పెన్షన్లు తీసుకున్న అనర్హుల జాబితాను తొలగించి ఆయా జిల్లాలకు అందజేశారు. తాజాగా పించన్ల పెంపుతో రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *