ఈరోజు ఉదయం నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న సుపరిపాలన కేంద్రంలో అర్బన్ ఫైనాన్స్ పై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, పట్టణాలు, నగరాల్లో యాంత్రిక జీవనం, ఒత్తిడి పెరిగిపోతున్నాయని, వాటికి విరుగుడుగా మానవ సంబంధాలు బలపడాలని అన్నారు. వచ్చేనెల కొత్త రాష్ట్రంలో మెట్రో పోలిస్ సదస్సు జరగడం సంతోషకరమని, ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ, నగరంలో నిర్వహించనున్న మెట్రో పోలిస్ సదస్సు వల్ల హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరుగుతుందని, సదస్సు నిర్వహణను సవాల్ గా తీసుకుంటున్నామని, సదస్సులో వాణిజ్య సంబంధ ఒప్పందాలు కుదురుతాయని పేర్కొన్నారు.