mt_logo

పత్రికాధిపతి పిట్టల దొర వేషాలు

By: రామకృష్ణ

ఆయనలో
ఒక ఫూలే కనిపిస్తున్నడు
ఒక అంబేద్కర్ కనిపిస్తున్నడు
ఒక గాంధీ మహాత్ముడు కనిపిస్తున్నడు
ఒక ఏసు ప్రభువు కనిపిస్తున్నడు
ఒక కొమురం భీం కనిపిస్తున్నడు
ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్‌ను తలపిస్తున్నడు
ఎందుకంటే ఆయన
రాజకీయాలు ఎలా ఉండాలో చెబుతున్నడు!
నాయకులు ఎలా నడచుకోవాలో నిర్వచిస్తున్నడు!
బడుగులు రాజకీయ భవిష్యత్తు గురించి బాధపడిపోతున్నడు!
నీతులు గీతలు చేతలు బోధిస్తున్నడు!
నిజాంను ఎదిరించిన యోధునిగా,
గడీలపై పోరిన సాయుధునిగా బిల్డప్ ఇస్తున్నడు!
అహాన్ని జయించడం గురించి వినిపిస్తున్నడు!

***

అంతేనా! ఆయనలో
ఒక మంద కృష్ణ కనిపిస్తున్నడు
ఒక విమలక్క కనిపిస్తున్నది
ఒక గజ్జెల కాంతం కనిపిస్తున్నడు
ఒక మోత్కుపల్లి కనిపిస్తున్నడు
ఒక దిలీప్‌కుమార్ కనిపిస్తున్నడు
ఒక బాలగోపాల్ కనిపిస్తున్నడు!
ఈ సారు
గడీల గురించి మాట్లాడుతున్నడు
బడుగుబలహీనవర్గాల గురించి మాట్లాడుతున్నడు
తెలంగాణకు ఏది మంచిదో చెబుతున్నడు
ఉద్యమాలు ఎలా నడపాలో నిర్దేశిస్తున్నడు
హక్కుల గురించి దంచుతున్నడు
జజ్జనకరి జనారే అని గజ్జెకట్టి ఆడుతున్నడు!
అసలు విషయం ఏమంటే
ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నడు
ఒకప్పుడు
మందకృష్ణను రాజశేఖర్‌రెడ్డికి ఏజెంటన్నడు
ఆయన మాటలే పత్రికలో కనిపించొద్దన్నడు
వీళ్లో నాయకలు, వీళ్లదో ఉద్యమం అన్నడు
ఉద్యమకారులకు ఏమీ పనిలేదన్నడు
హక్కుల్లేవు గిక్కుల్లేవు
పత్రికలో బాలగోపాల్ రాతలొద్దన్నడు!

***

ఆయనలో విశ్వరూపం తరచూ బయటపడుతుంది-
బహకృతవేషం అనడం బాగుండదు కదా!
తెచ్చిపెట్టుకున్నవే అయినా శంఖుచక్రగదాధరుడు కనిపిస్తున్నడు!
కాకపోతే ఈ విశ్వరూపంలో తెలంగాణ, టీఆరెస్,
కేసీఆర్, కేటీఆర్, తప్ప ఎవరూ కనిపించడంలేదు!
మనుషులను భూములను మాయం చేసినవాళ్లు లేరు
హైదరాబాద్‌ను కబ్జాచేసినవాళ్లు లేరు
వాళ్ల అహాలు, ఇహాలు, ఇగోలు, సెటిల్‌మెంట్లు లేవు
దందాలు, దారుణాలు, హత్యలు లేవు
చంద్రబాబు, బాలకృష్ణలు కనిపించరు
అహం మూర్తీభవించిన సింహాలు కనిపించవు
వాళ్ల కోటల్లో జరిగేవేవీ ఈ విశ్వరూపానికి దొరకవు
దొరికినా నెమలి పింఛాన్ని అడ్డంపెట్టి ఆపుతాడు
ఇంకా పరిటాల రవీంద్రల ఆనవాళ్లు లేవు
కావూరి హిల్స్ కహానీలు వినిపించవు
గురుకుల ట్రస్టు కుంభకోణాలు కనిపించవు
వంశీమోహన్‌లు, కేశవ్‌లు, దేవినేని ఉమలు కనిపించరు
కోడెల శివప్రసాద్‌లు, ధూళిపాళ్ల నరేంద్రలు కనిపించరు!
ఇదంతా ఒంటికన్ను విశ్వరూపం!
తెలంగాణపై ఎక్కుపెట్టిన బహుకృతవేషం!

***

నేను బ్రహ్మను, నేనే బ్రహ్మను
మీ రాతను గీతను చెరిపేతనూ నేనే!
వెనుకటికి ఒక పెద్దాయన ఇలాగే అనుకున్నాడు
చంద్రబాబు రాతను గీతను రెండూ మార్చలేకపోయాడు!
ఇప్పుడీయన బయలుదేరాడు కులవైభవోద్ధారకుని అవతారమెత్తి!

***

నేను మాఫియాను మహామాయను!
మాఫియాలు ఎక్కడయినా భయపడతారా?
భయపెట్టడం, బ్లాక్‌మెయిల్‌లు చేయడంలో నాకు నేనే సాటి!

***

ప్రభూ!
ఇది జర్నలిజం కాదు!
మహాఅయితే కీ హోల్ జర్నలిజం
సెలెక్టివ్, ఎలెక్టివ్ ఫాల్ట్ ఫైండింగ్!
మ్యాచ్ ఫిక్సింగ్ జర్నలిజం!
పొలిటికల్ ఎజెండాసెట్టింగ్ జర్నలిజం!
ఫ్రేమింగ్ అండ్ ఫినిషింగ్ జర్నలిజం!
తమరన్నట్టే కొందరిని కొంతకాలం మోసం చేయగలరు!
అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *