mt_logo

ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వడం కుట్రలో భాగమే-టీ జేఏసీ

బుధవారం జేఏసీ కార్యాలయంలో టీజేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్, టీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బిల్లుపై చర్చను అడ్డుకుంటూ సమయాన్ని వృథా చేసిన సీమాంధ్ర నేతలు ఇప్పుడు మరింత గడువు కావాలని కోరడం కుట్రలో భాగమని, ఇంతకాలం తెలంగాణ ప్రజలను మోసం చేసిన వారు ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను కూడా దారుణంగా మోసం చేస్తున్నారని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సీమాంధ్ర నేతలు, పోలీసులు రెండు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికే ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చారని అన్నారు. తెలంగాణ ప్రజలు సొంత గడ్డ మీద సభలు ఏర్పాటుచేసుకోవడానికి ఒప్పుకోని పోలీసు యంత్రాంగం సీమాంధ్ర ప్రజలకు ఎందుకు అనుమతి ఇస్తున్నదని దేవీప్రసాద్ ఈ సందర్భంగా మండిపడ్డారు. టీఆర్ఎస్ నేత శ్రవణ్ మాట్లాడుతూ, సభలో బిల్లుపై చర్చ జరక్కుండా అడ్డుకొని వైసీపీ, టీడీపీ నేతలు కాలయాపన చేస్తున్నారని, ఇంకా సమయం కావాలని కోరడం తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *