By: మిమిక్రీ జనార్ధన్
ప్రెస్ మీట్ల, టీవీ టాక్ షోల మాట్లాడుడు పెద్ద కష్టం కాదిప్పుడు.
వాండ్లేమడిగినా, మనం ఉల్టా కొన్ని అడగాలె…కొన్ని అనాలె
“పండంటి ప్రెస్ మీట్ కు/టాక్ షో కు పది సూత్రాలు” కింద పేర్కొనబడ్డవి చూడండి.
1. నీకెంతమంది పిల్లలు అని అడగాలె. వానికి లేకపోతే మీ నాయనకు ఎంతమంది పిల్లలు అని అడగాలె.
2. వాట్ ఐయాం టెల్లింగ్ ఈజ్/ వాట్ ఐయాం సేయింగ్ ఈజ్ (ఎన్ని సార్ల వీలైతే అన్ని సార్లు రిపీట్ చెయ్యాలె)
3. అందరికి న్యాయం జరగాలె/సమన్యాయం/సామాజిక న్యాయం జరగాలె అని అంటా ఉండాలె. అవుతలోడు తల్కాయ పగులగొట్టుకున్నా అదేందో చెప్పొద్దు.
4. దివంగత నాయకుల పేర్లు చెప్పుకుంట…వాండ్లు కలగన్నట్టు, వాండ్లు కలగన్నట్టు …అని అంటుండాలె! అవుతలోడు తల్కాయ పగులగొట్టుకున్నా అదేందో చెప్పొద్దు.
5. మన మీద ఉన్న అవినీతి ఆరోపణలను డైవర్ట్ చేసేటందుకు ఏదో ఒక సంచలన వ్యాఖ్య చెయ్యాలె.
6. “సిగ్గు, శరం, లజ్జ, మానం, అభిమానం,
7. ప్రజాస్వామ్యం అనే పదాన్ని ఎట్లవీలైతె అట్ల,ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు జపం జేసినట్టు అంటా ఉండాలె.(వీలైతె టాటూ ఏస్కోని చూపించాలె)
8. నీ ఆస్తుల గురించి మాట్లాడితె పక్కోని ఆస్తుల గురించి చెప్పాలె.
9. సాధ్యమైనంత వరకు బామ్మర్దులను, బావలను ప్రెస్ మీట్ల/టాక్ షోల మాట్లాడకుండ చేయాలె.
10. ఏదన్న గట్టిగ అడిగితే “అటువంటిదేం లేదు…అంతా మీసృష్టే” అని చెప్పాలె. మళ్ల అడిగితే, మళ్ల అదే సమాధానం రెట్టించాలె.
ఇంకా అట్లనే అడిగితె లోకల్ మీడియాతోటి మాట్లాడుడు బంద్ జెయ్యాలె. నేషనల్ మీడియాతోటి మాత్రమే మాట్లాడాలె.