గురువారం నాటి తెలంగాణ శాసనసభా సమావేశాలు ప్రారంభం కాగానే డిప్యూటీ స్పీకర్ గా పద్మాదేవేందర్ రెడ్డిని సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపసభాపతిగా ఎన్నికైన ఆమెను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అభినందించారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సహకరించినందుకు విపక్షాలకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్ మాట్లాడారు.
మూడున్నర సంవత్సరాలు పద్మ న్యాయవాదిగా సేవలందించారని, రామాయంపేట జెడ్పీటీసీగా రికార్డు మెజార్టీతో గెలుపొంది చిన్న వయసులోనే అత్యున్నత స్థానానికి చేరుకున్న పద్మను చూసి మెదక్ జిల్లా వాసిగా గర్వపడుతున్నానని అన్నారు. మంత్రి గీతారెడ్డి కూడా డిప్యూటీ స్పీకర్ గా మహిళ ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పద్మాదేవేందర్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు.