– ఎన్నారై. టీ.ఆర్.యస్ అధ్యక్షులు అనీల్ కూర్మాచలం
ఇటు క్షేత్రస్థాయిలోనే కాకుండా ఖండాంతరాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు సైతం టీ.ఆర్.యస్ పార్టీలో చేరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చడానికి ముందుకు వస్తున్నారు.
నాడు ఉద్యమం లో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాదించిన కేసీఆర్ గారు, నేడు రాష్ట్రాన్ని “బంగారు తెలంగాణ” గా చేయడం కూడా కేవలం కేసీఆర్ గారి వల్లే సాధ్యమని, మన ఇంటి పార్టీ ని మనం కాపాడుకోని అన్ని సందర్బాల్లో వీలైనంత సహాయ సహకారాలు అందించడానికి, ఆస్ట్రేలియ లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు ముందుకు వచ్చారని, కాబట్టి త్వరలో “ఎన్నారై టీ.ఆర్.యస్ సెల్ – ఆస్ట్రేలియా” విభాగం ప్రారంభం అవుతుందని ఎన్నారై. టీ.ఆర్.యస్ అధ్యక్షులు అనీల్ కూర్మాచలం తెలిపారు.
అలాగే కేసీఆర్ గారి ఆదేశానికి మరియు టీ.ఆర్.యస్ ఎంపీ కవిత గారి ప్రోత్సాహం మేరకు తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడ ఎన్నారై టీ.ఆర్.యస్ శాఖలు ఏర్పాటు చేసి గులాబీ మయం చేసి అటు ప్రభుత్వానికి – ప్రవాస బిడ్డలకు వారధిగా నిలబడతామని తెలిపారు, సంప్రదించవలసిన ఈమెయిల్ nritrs.aus@gmail.com.
త్వరలో కమిటీ వివరాలు తెలియజేస్తామని, ఆవిర్భావ సభను కూడా ఘనంగా నిర్వహిస్తామని ఎన్నారై. టీ.ఆర్.యస్ అధ్యక్షులు అనీల్ కూర్మాచలం తెలిపారు. అలాగే ఈ సందర్భంగా ఎన్నారై లకు అవకాశం కల్పించినందుకు టీ.ఆర్.యస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి మరియు పార్టీ సభ్యత్వం తీసుకున్న ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపారు.