విద్యుత్ శాఖలో 1422 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర సర్కార్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, జేఎన్టీయూ ఆధ్వర్యంలో పరీక్షను నిర్వహిస్తామని, డిసెంబర్ లోగా నియామకాల ప్రక్రియను పూర్తిచేస్తామని చెప్పారు.
ఉద్యోగాలకు కొత్తగా ఎన్నికైన అభ్యర్థులందరూ జనవరి 1 నుండి విధుల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. జెన్కో అభ్యర్థులకు నవంబర్ 14న, ఎస్ పీడీసీఎల్ అభ్యర్థులకు నవంబర్ 22న, ట్రాన్స్ కో అభ్యర్థులకు నవంబర్ 29న పరీక్ష ఉంటుందని, వివరాలన్నీ వెబ్ సైట్ లో పొందుపరుస్తామని జగదీష్ రెడ్డి తెలిపారు.