mt_logo

ధిక్కారం వినిపిస్తే అంతే!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటూ సమైక్యవాద ముసుగులో అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్న 8మంది సీమాంధ్ర నేతలపై ఏఐసీసీ కొరడా ఝళిపించింది. శుక్రవారం డిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశానికి 6గురు ఎంపీలు, ఇద్దరు మాజీ మంత్రులకు పాసులు నిరాకరించింది. వారిలో లగడపాటి, రాయపాటి, సబ్బం హరి, ఉండవల్లి, హర్షకుమార్, సాయిప్రతాప్(ఎంపీలు) కాగా, జేసీ దివాకర్ రెడ్డి, గాదె వెంకట్ రెడ్డి(ఎమ్మెల్యేలు) ఉన్నారు. ఈ ఆరుగురు ఎంపీలు సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాసతీర్మానాన్ని స్పీకర్ కు అందజేసినందుకు అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉంది. జేసీ దివాకర్ రెడ్డి, గాదె వెంకట్ రెడ్డి కూడా విభజన విషయంలో అధిష్ఠానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జేసీకి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసినట్లు రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఏఐసీసీ సదస్సుకు హాజరు కావద్దంటూ సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ ఈ 8మందికీ సమాచారం అందించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *