mt_logo

సీమాంధ్ర పెత్తనం ఇక ఉండదు-ప్రొ.కోదండరాం

నల్గొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి గ్రీన్‌ల్యాండ్ లో న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ పునర్నిర్మాణం సదస్సులో టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రుల పెత్తనం కూకటివేళ్ళతో తొలగిస్తామని అన్నారు. పునర్నిర్మాణం అంటే తెలంగాణలోని నిర్మాణాలను కూల్చడం కాదని, తెలంగాణలో పాతుకుపోయిన సీమాంధ్ర పెత్తనాన్ని కూకటివేళ్ళతో తీసివేయడమని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడిందని, దానికి కారణం సీమాంధ్ర పాలకుల కుట్రపూరిత చర్యలే అని మండిపడ్డారు. దగాపడిన తెలంగాణను పునర్నిర్మించుకోవడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్స్ జేఏసీ చైర్మన్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో డాక్టర్లు, లాయర్ల పాత్ర గొప్పదని, సీమాంధ్ర నేతలకు వ్యతిరేకంగా పోరాడటంలో వారి కృషి మరువలేనిదని అన్నారు. తెలంగాణలో సీమాంధ్ర ప్రజలు క్యాన్సర్ కణాలకన్నా ప్రమాదకరమని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *