mt_logo

నిజామాబాద్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

నిజామాబాద్ కలెక్టరేట్ లో సోమవారం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వేలాదిమంది మహిళలు పాల్గొన్నారు. పోచారం సతీమణి, బాజిరెడ్డి గోవర్ధన్ సతీమణి, జెడ్పీ వైస్ చైర్మన్ సుమన రవిరెడ్డి తదితరులతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు.

ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ, గతంలో తెలంగాణ సాధన కోసం కోటి బతుకమ్మలనెత్తి రాష్ట్రాన్ని సాధించాం. ఈనాడు బంగారు బతుకమ్మలనెత్తినం.. బంగారు తెలంగాణను నిర్మించుకుందామని అన్నారు. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా పేరు సాధించేలా చేసేందుకు తనను ఎంపీగా ఎన్నుకున్నారని, ఈ జిల్లా ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని, ఆడబిడ్డలంతా తనను సొంత బిడ్డలా అక్కున చేర్చుకుంటున్నారన్నారు.

వ్యవసాయ శాఖామంత్రి పోచారం మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవ వేడుకని, బోనాలతో పాటు బతుకమ్మను కూడా అధికారికంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం యావత్ తెలంగాణ ప్రజల ప్రశంసలను అందుకుందని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ మరుగున పడుతున్న సమయంలో కవిత తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూనే మహిళలందర్నీ ఉద్యమం వైపు తీసుకెళ్ళే అంశంలో విజయం సాధించారని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *