వచ్చే నాలుగేళ్ళలో వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తామని, ప్రతి ఇంటికి మంచి నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ రూపుమాపడానికి వాటర్ గ్రిడ్ పథకం తోడ్పడుతుందని, వాటర్ గ్రిడ్ పథకాన్ని సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా నుండే ప్రారంభిస్తారని చెప్పారు. వాటర్ గ్రిడ్ కోసం అదనంగా 1200 మంది సిబ్బందిని నియమిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదిలాఉండగా ఈరోజు మధ్యాహ్నం వాటర్ గ్రిడ్ పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వాటర్ గ్రిడ్ కు సంబంధించిన అనేక అంశాలతో పాటు టెండర్లపై చర్చిస్తారని సమాచారం.