mt_logo

Naked Opportunism of Seemandhra Leadership Exposed

.

Here is a naked proof of Seemandhra leaders’ opportunism. At an All Party Meeting held by the Andhra Pradesh State government, Telugu Desam Party headed by Chandra Babu Naidu and Praja Rajyam Party headed by Chiranjeevi have promised to support a Telangana resolution in the assembly.

Believing these two leaders, the UPA government went ahead and declared that the process of formation of Telangana state would be initiated.

And within hours of that statement both Chandra Babu Naidu and Chiranjeevi backtracked on their promise.

It was reported in today’s newspapers that the state government has permanently erased all traces of the crucial Minutes of the Meeting of that All Party Meeting.

Seems like they clearly under-estimated the Telangana activists. Here is a copy of the Minutes of the Meeting held on 7th December 2009. RTI activist Rakesh Reddy Dubbudu had obtained these with much difficulty.

These documents prove beyond doubt how cunning Seemandhra leadership is.

***

[Click on the thumbnails to see full size image]

***

****

Below is a news from today’s Namasthe Telangana about how the Chief Minister’s office has deliberately erased all traces of this crucial document.

అంతా మాయం!

-2009 డిసెంబర్ 7 నాటి అఖిలపక్ష సమావేశం వివరాలు కనుమరుగు
-తెలంగాణ అనుకూల పరిణామాలు.. మటుమాయం చేసే కుట్ర!
-సీమాంధ్ర సర్కారు నుంచి సాక్షాత్తూ మంత్రికే మొండిచెయ్యి
-అధిష్ఠానం కోరినందుకే.. వీటిని సేకరించిన పొన్నాల

chiru-tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

ఇది కుట్రా? లేక మరో వివక్షా? తెలంగాణ అనుకూల పరిణామాలు కనుమరుగు చేసి.. ఎప్పటిలాగే చేస్తున్న ద్రోహానికి కొనసాగింపా? కేవలం ఏడాదిన్నర కిందట తెలంగాణపై జరిగిన అఖిలపక్షం భేటీ వివరాలు సీమాంధ్ర సర్కారు వద్ద లేనేలేవట! తెలంగాణ ప్రజల కళ్లముందు ఇంకా సజీవంగా కదలాడుతున్న 2009 డిసెంబర్ 7 నాటి రాజకీయ పార్టీల అఖిలపక్ష భేటీ వివరాలు రాష్ట్ర సర్కారు ఇవ్వలేకపోతోంది. ఈ భేటీలో అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలమన్నాయి. కేసీఆర్ దీక్ష, ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం.. అగ్నిగుండంగా మారిన తెలంగాణ.. అన్ని పార్టీలూ సై అని తలూపడంతో కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణను ప్రకటించింది. ఆనాటి తెలంగాణ అనుకూల పరిణామాలు మటుమాయం చేసింది. స్వయంగా ప్రభుత్వమే పనిగట్టుకుని మరీ ఈ వివరాలను కనుమరుగు చేయడంపై తెలంగాణ వాదులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్, జూలై 6(టీ న్యూస్): తెలంగాణకు అనుకూలమైన రికార్డులను సైతం సీమాంధ్ర ప్రభుత్వం మాయం చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక తెలంగాణపై రాజకీయ పార్టీల అభివూపాయ సేకరణ కోసం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవట! సాక్షాత్తూ ఓ సీనియర్ మంత్రి ఆ వివరాలు కోరినా.. తమ వద్ద లేవని సర్కారు చెప్పినట్లు తెలిసింది. ప్రత్యేక తెలంగాణకు అనుకూల రికార్డులను కనుమరుగు చేసేందుకు సీమాంధ్ర సర్కారు ప్రయత్నిసున్నట్లు దీనిని బట్టి తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అన్ని పార్టీల అభివూపాయాలు సేకరించాలని కేంద్రం ఆదేశించడంతో 2009 డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీల నేతలు ముక్తకం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమని స్పష్టం చేశారు.

ఈ సమావేశం వివరాలను అదేరోజు సీఎం రోశయ్య కేంద్రానికి పంపారు. అతి ముఖ్యమైన ఈ సమావేశం మినిట్స్(వివరాల)ను ముఖ్యమంత్రి కార్యాలయం మాయం చేయడం చర్చనీయాంశమైంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా గతంలో చోటుచేసుకున్న పరిణామాల రికార్డును సేకరించేందుకు ఇటీవలి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన మంత్రులు ప్రయత్నించారు. అప్పటి అఖిలపక్ష భేటీ వివరాలను అందజేయాల్సిందిగా సీనియర్ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బుధవారం సచివాలయంలోని సాధారణ పరిపాలన విభాగాన్ని కోరారని, అయితే ఆ వివరాలు తమ వద్ద లేవని స్పష్టం చేశామని సాక్షాత్తూ ఆ శాఖ అధికారులు తెలిపారు.

ఈ అఖిలపక్ష భేటీని సీఎం కార్యాలయం నిర్వహించి.. ఆ వివరాలను నేరుగా కేంద్ర హోంమంత్రి కార్యాలయానికి పంపిందని సాధారణ పరిపాలన శాఖ వెల్లడించింది. ఈ వివరాలను సీఎం కార్యాలయం నుంచైనా సంపాదించాలని ప్రయత్నించిన పొన్నాలకు అక్కడ మొండి చెయ్యే ఎదురయింది. ఆ భేటీకి సంబంధించిన రికార్డు తమ వద్ద కూడా లేదని సీఎం కార్యాలయం చేతుపూత్తేసింది. ఈ వివరాలతో కూడిన ఒక కాపీ మాత్రమే తయారు చేసి దాన్ని కేంద్ర హోంమంవూతికి పంపామని చెప్పినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ వివరాల కాపీ కావాలంటే కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో లభిస్తుందని, అక్కడి నుంచి తీసుకోవచ్చని ఓ ఉచిత సలహాను పారేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *