మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తున్నది.
ఇందులో భాగంగా ఈరోజు మొదటి రోజు బతుకమ్మ సంబురాలు పామ్ కోర్ట్ కాండోమినియం లో జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆడపడుచులు మరియు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని ఆడి పాడారు. ఇదే విధంగా మిగితా మూడు రోజులు వివిధ ప్రాంతాలలో జరిపి చివరగా 8 వ తారీఖున ఘనంగా బతుకమ్మ సంబురాలు జరుపబడును.
MYTA తెలంగాణ సంస్కృతిని కాపాడటమే కాకుండా మలేషియా నలుమూలలా వ్యాపింపజేస్తుంది. ఈ సంబురాలను తెలంగాణ NRIs ఏ కాకుండా మలేషియా లోకల్ తెలుగు ప్రజలనుండి గొప్ప స్పందన లభిస్తుంది.
ఈ కార్యక్రమంలో మైట ప్రెసిడెంట్ తిరుపతి వైస్ ప్రెసిడెంట్ చోపరి సత్య ముఖ్య కార్యవర్గ సభ్యులు మహిళా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.