mt_logo

ముగిసిన టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ల పర్వం

తెలంగాణలో నామినేషన్లు వేయడానికి ఈరోజే చివరి రోజు కావడంతో 119 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థులు తెలంగాణలోని 10 జిల్లాలలో నామినేషన్లు దాఖలు చేశారు. మెదక్ లోక్ సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా, జహీరాబాద్ ఎంపీ స్థానానికి బీబీ పాటిల్, నిజామాబాద్ ఎంపీ స్థానానికి కల్వకుంట్ల కవిత, ఖమ్మం ఎంపీ స్థానానికి బుడాన్ బేగ్ షేక్ , సిద్దిపేట అసెంబ్లీకి హరీష్ రావు, సిరిసిల్ల అసెంబ్లీ స్థానానికి కల్వకుంట్ల తారకరామారావు, మెదక్ అసెంబ్లీ స్థానానికి పద్మా దేవేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే శేఖర్ రెడ్డి, పటాన్ చెరు అసెంబ్లీ స్థానానికి గూడెం మహిపాల్ రెడ్డి, తాండూర్ అసెంబ్లీకి మహేందర్ రెడ్డి, కూకట్ పల్లి అసెంబ్లీ స్థానానికి గొట్టిముక్కల పద్మారావు, పెద్దపల్లి లోక్ సభ స్థానానికి బాల్క సుమన్ తదితరులు నామినేషన్ వేశారు.

నామినేషన్లు వేసిన తర్వాత కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ, సిరిసిల్ల టిక్కెట్ ఇచ్చినందుకు తాను కేసీఆర్ కు, నాయకత్వానికి ఋణపడిఉంటానని, తెలంగాణలో సిరిసిల్లను అగ్రశ్రేణిలో నిలబెడతానని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న బాల్క సుమన్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ఓ వ్యాపారవేత్తకు, విద్యార్థికి మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు. వందకోట్లు ఉన్న వివేక్ కు, తెలంగాణలో వంద కేసులు ఉన్న తనకు మధ్య పోటీనే ఈ ఎన్నికలు అని తెలిపారు. వివేక్ స్వార్ధ రాజకీయాలకోసమే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళారని విమర్శించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *