సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరిగింది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురు మంత్రులను సీఎం కేబినెట్ కు పరిచయం చేశారు. ఇదిలాఉండగా ఈరోజు సాయంత్రం కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉందని తెలిసింది. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 ని తెలంగాణ రాష్ట్రానికి అడాప్ట్ చేసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం పేరుతో ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కు మంత్రివర్గ ఆమోదం లభించింది.
అనంతరం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో అఖిలపక్ష సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశంలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, మెట్రోరైల్ అలైన్ మెంట్, జీహెచ్ఎంసీ పరిధిలోని భూముల క్రమబద్ధీకరణ, హైదరాబాద్ సమస్యలపై చర్చిస్తున్నట్లు తెలిసింది.