mt_logo

పసుపు బోర్డుపై ఎంపీ కవిత పోరాటానికి నాడే లండన్ లో సంఘీభావ దీక్షలు చేశాం..

పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించండి.. ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం..

లండన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు గత ఐదు సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం చేసిన కృషి చాలా గొప్పదని, నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో లండన్ వీధుల్లో రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ పోరాటాలు చేసిన మేము మళ్ళీ పసుపు బోర్డుకై ఎంపీ కవిత గారి పోరాటానికి సంఘీభావంగా లండన్ లో నిరసన కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. దీన్నిబట్టి నిజామాబాద్ రైతులు అర్ధం చేసుకోవాలి. ఎంపీ కవిత గారు ఎంత కృషి చేశారో.. ఖండాంతరాల్లో ఉన్న మేము సైతం కదిలేలా పోరాటం చేశారు. కాబట్టి మళ్ళీ కవిత గారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపితే ఈసారి తప్పకుండా కావల్సినవన్నీ సాధించుకుని మీకు అండగా ఉంటారని చెప్పారు.

జాతీయ పార్టీలని చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి లేకుండా లేనిపోని విమర్శలు చేయడం వారి చేతకాని తనానికి నిదర్శనమని, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని హామీలు ఇప్పుడు ఓట్ల కోసం, సీట్ల కోసం గుర్తుకు వస్తున్నాయని, ప్రజలు మళ్ళీ తగిన బుద్ధి చెప్పాలని అనిల్ కూర్మాచలం కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *