ఫొటో: అదిలాబాద్ జిల్లాలో పోలీసుల తనిఖీలు
—
తెలంగాణ మార్చ్ దగ్గర పడుతుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెన్నులో వణుకు మొదలైంది. ముందుగా భావించినట్టు మార్చ్ ఒక్క రోజు కొరకు కాదని, అది తెలంగాణ ప్రకటన వచ్చేంతవరకూ కొనసాగుతుందని అర్థం అవడంతో బెంబేలెత్తిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఉద్యమకారులను కట్టడి చేయడానికి సైన్యాన్ని రంగంలోకి దించడానికి సమాయుత్తమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే వేలాది మంది పోలీసులు, పారా మిలిటరీ బలగాలు తెలంగాణ పది జిల్లాలను జల్లెడ పడుతున్నాయి. హైదరాబాదుకు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు.
సైన్యాన్ని రంగంలోకి దించితే జీవ వైవిధ్య సదస్సుకు దాదాపు 200 దేశాల నుండి వస్తున్న 10,000 మంది డెలిగేట్స్ కు, ప్రజా ఉద్యమాలతో భారత ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తుందో ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తుంది. ఒక ప్రజాస్వ్యామ్య దేశంలో రాజ్యాంగబద్ధమైన హక్కు కొరకు ఉద్యమిస్తున్న తెలంగాణ ఉద్యమంపై సైన్యాన్ని ప్రయోగించే దుస్సాహసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే దానికి నూకలు చెల్లినట్టే.