mt_logo

మంచిర్యాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ వేడుకలు ఆదివారం మంచిర్యాలలో ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సతీమణి రాజకుమారి, ఎంపీ బాల్క సుమన్ సతీమణి అలేఖ్యలతో కలిసి కవిత బతుకమ్మను పేర్చారు. అనంతరం దివాకర్ రావు ఇంటినుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లి హిందీ హైస్కూల్ గ్రౌండ్స్ కు చేరుకొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

ఈ సందర్భంగా ఎంపీ కవిత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే బతుకమ్మ అంత ప్రత్యేకమైన పండుగ లేదని, కొత్తగూడెంలో తాము నీళ్ళు లేక బతుకమ్మను చెట్టుకింద పెట్టి వెళ్తే బతుకమ్మను నిర్లక్ష్యం చేశారంటూ ఆంధ్రా పత్రికల్లో హెడ్డింగ్ పెట్టి రాసి పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆంధ్రా బుద్ధులు మార్చుకోవాలని కవిత సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఆదిలాబాద్ ఎంపీ నగేష్, మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, దివాకర్ రావు, నల్లాల ఓదెలు, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *