మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో “MYTA CRIC 2K16” క్రికెట్ టోర్నమెంట్ మొట్టమొదటి సారిగా కౌలాలంపూర్ లోని బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించింది. ఈ టోర్నీ లో 400 మందికి పైగా ఐటీ ఉద్యోగులు 24 టీమ్స్ గా పాల్గొని నాలుగు వారాంతాలలో ఆడి ఈరోజు ఫైనల్ మ్యాచ్ తో ముగించారు.
ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డిప్యూటీ హై కమిషనర్ అఫ్ ఇండియా నిఖిలేష్ చంద్రగిరి గారు, ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ మలేషియా ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ మీనాల్ మిశ్రా గారు, తెలుగు ఎక్స్పాట్ ప్రెసిడెంట్ అనిల్ గారు, డిప్యూటీ ప్రెసిడెంట్ సింగపూర్ శ్రీనివాస్ గారు విజేతలకు ట్రోఫీలని అందజేశారు. ఈ టోర్నీ కి మెయిన్ స్పాన్సర్ గా AVOWS సంస్థ ముందుకు రాగ కో-స్పాన్సర్స్ గా UAE Exchange, VetaraSoft, JD Indian Recipes ముందుకు వచ్చాయి.
ఈ సందర్భంగా MYTA ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ మలేషియా లో ఉంటున్న తెలంగాణ మిత్రులు కలిసికట్టుగా ఉండటానికి తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమములే కాకుండా ఇలాంటి స్పోర్ట్స్ సహకరిస్తాయని అన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ తోనే ఆగిపోకుండా ముందు ముందు బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ లాంటి స్పోర్ట్స్ వుంటాయని అయన అన్నారు. తక్కువ సమయంలోనే స్పందించిన MYTA సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. టోర్నీ విజేతలు పామ్ కోర్ట్ వారియర్స్ కి ప్రైజ్ మనీ అందజేసి వారిని అభినందించారు.
ఈ కార్యక్రమమంలో మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి వైస్ ప్రెసిడెంట్ చోపారీ సత్య ముఖ్య కార్యవర్గ సభ్యులు రవి వర్మ, చిట్టి, రఘు, రవీందర్ రెడ్డి, క్రిష్ణ వర్మ, బూరెడ్డి మోహన్ రెడ్డి, రవి చంద్ర, స్టాలిన్, చందు, శ్రీధర్ హజారీ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.