పోచంపల్లి చీర అద్భుతం: మహువా మోయిత్రా

  • September 15, 2021 8:54 pm

ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తెలంగాణ పోచంపల్లి చీరను ధరించి మురిసి పోయారు. ఇటీవల ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో హైదరాబాద్‌లో పర్యటించిన ఐటీ పార్లమెంట్ కమిటీని మంత్రి కేటీఆర్ సత్కరించారు. ఈ క్రమంలో కమిటీ సభ్యురాలైన మహువా మోయిత్రాకి పోచంపల్లి చీరను కానుకగా అందజేయగా.. మంగళవారం ఆ చీరను ధరించి మెరిసిపోయారు. “ఇండియన్ హ్యాండ్లూమ్ అద్భుతం. తెలంగాణకు చెందిన మోస్ట్ బ్యూటిఫుల్ పోచంపల్లి చేనేత కాటన్ చీరను ధరించాను. దీనిని ఇటీవల ఐటీ కమిటీ పర్యటనలో కేటీఆర్ బహూకరించారు” అంటూ మహువా మోయిత్రా ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ “తెలంగాణ పోచంపల్లి చేనేతలను ప్రమోట్ చేసినందుకు కృతజ్ఞతలు. మా బహుమతి మీకు నచ్చినందుకు సంతోషిస్తున్నాం” అని రీట్వీట్ చేశారు.


Connect with us

Videos

MORE