ప్రియమైన ఎడిటర్ గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా,
లండన్‌లో ఘనంగా జయశంకర్ సార్‌కి నివాళి: తెలంగాణ ఎన్నారై ఫోరం మరియు ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ప్రొ. జయశంకర్ గారి జయంతి వేడుకులని లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకి యు.కే నలుమూలల నుండి తెలంగాణవాదులు, టి.ఆర్.యస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
ముందుగా జయశంకర్ గారి చిత్రపటాన్ని పూలతో నివాళులర్పించి, తరువాత కొవ్వొత్తులతో తెలంగాణ అమరవీరులను, జయశంకర్ గారిని స్మరిస్తూ అలాగే ఇటీవల మెదక్ జిల్లాలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండునిమిషాలు మౌనం పాటించారు.
తరువాత సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, తెలంగాణ బావజాల వ్యాప్తిలో జయశంకర్ గారి పాత్ర గొప్పదని, వారు చివరివరకు తెలంగాణ రాష్ట్ర సాధనకోసమై పనిచేశారని, అటువంటిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన సంతోష సందర్భంలో మనవద్ద లేకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.
అనుకున్న ఆశయసాధనకై వారు చేసిన కృషి ప్రతీవ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని, వారి జీవిత వృత్తాంతాన్ని పాఠ్యపుస్తకాలలో పెట్టాలని, ట్యాంక్‌బండ్‌పై కాంస్యవిగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రవాస తెలంగాణ సంఘాలు అన్ని ఆచార్య గారిమానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనం తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.
TNF అధ్యక్షులు సిక్క చంద్ర శేఖర్ గౌడ్, TNF ఉపాధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది, అడ్వైసరీ బోర్డు చీఫ్ ఉదయ నాగరాజు, జాయింట్ సెక్రటరీ గోలి తిరుపతి, ఈవెంట్స్ ఇంచార్జ్ ప్రమోద్ అంతటి, ఈవెంట్ సెక్రటరీ నగేష్ రెడ్డి, ఉమెన్స్ సెల్ ఇంచార్జ్ అర్చన జువ్వాడి, నవీన్ రెడ్డి, ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ జాయింట్ సెక్రటరీ దుసరి అశోక్ గౌడ్, సుమాదేవి, సుధాకర్, శ్వేతా, వాణి, వెంకట్ రంగు, విక్రం రెడ్డి, అపర్ణ, రాజు, గోలి సుమన్, జయ కుమార్, ప్రణీత్, రత్నాకర్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.